JanaSena: జనసేన బీసీ కులాల ఐక్యత కోరుకుంటోంది.. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రకటించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంక్షేమంపై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేషన్ల పేరుతో వైసీపీ బీసీ కులాలను విడదీస్తోందని విమర్శించారు.. కార్పొరేషన్ల ద్వారా బీసీలకు స్టిక్కర్ అతికించుకోవడం తప్ప బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదన్న ఆయన.. స్టిక్కర్లు వేసుకుని టోల్ గేట్ల వద్ద గొడవ పడటానికి…