బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సర్వే గురువారం వరుసగా మూడో రోజు కొనసాగుతోంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎంపిక చేసిన బీబీసీ సిబ్బంది నుంచి ఆర్థిక డేటాను సేకరించారు.
బీబీసీ కార్యాలయాల్లో రెండో రోజూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎలక్ట్రానిక్ రూపంలో, దస్త్రాల్లో ఉన్న ఆర్థిక వ్యవహారాల సమాచారం నకలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.