తెలంగాణ వాసులు ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ‘బతుకమ్మ’ సంబరాలు మొదలయ్యాయి. ఈ తొమ్మిది రోజులూ సాయంత్రం కాగానే అందమైన పూలతో తయారు చేసిన ‘బతుకమ్మ’ను మధ్యలో పెట్టి చుట్టూ చేరి మహిళలంతా ఆటపాటలతో సందడి చేస్తారు. 9 రోజులపాటు రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తూ రోజుకో పేరుతో బతుకమ్మను సెలెబ్రేట్ చేసుకుంటారు. అందులో ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ,…
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక, రాష్ట్ర పండుగ బతుకమ్మ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్.. తీరొక్కపూలను పేర్చుకుని తొమ్మిది రోజులపాటు ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాల నడుమ ఆటాపాటలతో ఆడబిడ్డలు బతుకమ్మ సంబురాలు జరుపుకుంటారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.. ఒకనాడు సమైక్యపాలనలో విస్మరించబడిన బతుకమ్మను స్వయం పాలనలో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్న ఆయన… తెలంగాణ ప్రజల జీవనంలో భాగమైపోయిన ప్రకృతి పండుగ బతుకమ్మ, నేడు ఖండాంతరాలకు విస్తరించడం గొప్పవిషయమన్నారు. తెలంగాణ సంస్కృతికి…