తెలుగు విశ్వ విద్యాలయంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళ్ సై మరియు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ…. బతుకమ్మ పాటలలో ఉండే తెలుగు పదాల మీద పరిశోధన చేస్తే, తెలుగు బాష మరింత పరిపుష్టం అవుతుందన్నారు. తెలంగాణ జాగృతితో పాటు, అనేక సంస్థలు బతుకమ్మ పండుగకు సంబంధించి పాత పాటలు సేకరిస్తున్నారని… పాత బతుకమ్మ పాటల్లో ఉండే పదాల మీద ప్రత్యేక అధ్యయనం చేసినట్లైతే,…
తెలంగాణ వాసులు ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ‘బతుకమ్మ’ సంబరాలు మొదలయ్యాయి. ఈ తొమ్మిది రోజులూ సాయంత్రం కాగానే అందమైన పూలతో తయారు చేసిన ‘బతుకమ్మ’ను మధ్యలో పెట్టి చుట్టూ చేరి మహిళలంతా ఆటపాటలతో సందడి చేస్తారు. 9 రోజులపాటు రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తూ రోజుకో పేరుతో బతుకమ్మను సెలెబ్రేట్ చేసుకుంటారు. అందులో ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ,…
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక, రాష్ట్ర పండుగ బతుకమ్మ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్.. తీరొక్కపూలను పేర్చుకుని తొమ్మిది రోజులపాటు ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాల నడుమ ఆటాపాటలతో ఆడబిడ్డలు బతుకమ్మ సంబురాలు జరుపుకుంటారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.. ఒకనాడు సమైక్యపాలనలో విస్మరించబడిన బతుకమ్మను స్వయం పాలనలో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్న ఆయన… తెలంగాణ ప్రజల జీవనంలో భాగమైపోయిన ప్రకృతి పండుగ బతుకమ్మ, నేడు ఖండాంతరాలకు విస్తరించడం గొప్పవిషయమన్నారు. తెలంగాణ సంస్కృతికి…
బతుకమ్మ, దసరా పండులను పురస్కరిచంఉకుని బుధవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనుంది ప్రభుత్వం. ఈ రెండు పండుగల సందర్భంగా ఈ నెల 6 నుంచి 17 వ తేదీ వరకు ఏకంగా 12 రోజుల పాటు సెలవులు ఇవ్వనుంది తెలంగాణ సర్కార్. ఇక తిరిగి ఈ నెల 18న పాఠశాలలు పున ః ప్రారంభం కానున్నాయి. ఇక అటు ఇంటర్ కళాశాలలకు ఈ నెల 13 వ తేదీ నుంచి సెలవులు ఇవ్వనుంది…
అందమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ మీనన్.. ‘చెలి, ఘర్షణ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఏం మాయ చేసావే’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. ప్రేమకథలతోనే కాకుండా యాక్షన్ సినిమాలతోను గౌతమ్ మీనన్ ఆకట్టుకున్నాడు. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు.. తాజాగా తెలంగాణ జాగృతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన బతుకమ్మ పాట ‘అల్లిపూల వెన్నెల’ కు…
ప్రతీ ఏడాది తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం… ఇక, ఈ ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా ఇచ్చే చీరల పంపిణీ ఇవాళ ప్రారంభం కానుంది.. ఇప్పటికే జీహెచ్‌ఎంసీతో పాటు ఆయా జిల్లాల్లో చీరల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. రాష్ట్రంలో అర్హులైన మహిళలకు చీరల పంపిణీ శనివారం నుంచి చేస్తామని టెస్కో ఎండి శైలజా రామయ్యర్ వెల్లడించారు.. ఆహారభద్రత కార్డు కింద పేర్లు నమోదైన 18 ఏళ్లు…