Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో మత ఛాందసవాదం మరింత పెరిగింది. బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత అయిన మహ్మద్ యూనస్ కూడా రాడికల్ ఇస్లామిక్ సంస్థలైన ‘‘జమాతే ఇస్లామీ’, ‘‘హిజ్‌బుత్ తెహ్రీర్’’ వంటి సంస్థలపై మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాడు. దీంతో ఈ గ్రూపులు దేశవ్యాప్తంగా రెచ్చిపోతున్నాయి. మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి.