Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో ఒకేసారి భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. 23 మంది లొంగిపోవడంతో పోలీసులు అతిపెద్ద విజయం సాధించారని చెప్పవచ్చు. వీరందరిపై కలిపి రూ. 1.18 కోట్ల నజరానా ఉంది. శనివారం, వీరంతా సుక్మా జిల్లా పోలీసులు ముందు లొంగిపోయారు. దీనికి ఒక రోజు ముందు, సుక్మా సరిహద్దు జిల్లా అయిన నారాయణపూర్ జిల్లాలో 22 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెట్టారు. సుక్మా పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త…
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం నక్సలైట్లు ముగ్గురు గ్రామస్థులను చంపేశారు. బాధితులను తాళ్లతో గొంతు కోసి దారుణంగా చంపారు. ఈ దాడి స్థానికుల్లో భయాన్ని వ్యాప్తి చేయడానికి నక్సలైట్లు చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వామపక్ష తీవ్రవాదానికి కేంద్రంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడంలో భద్రతా దళాలు గణనీయమైన విజయాలు సాధిస్తున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి దాడి జరగడం గమనార్హం .
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో శనివారం భద్రతా సిబ్బందితో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు.