గుంటూరు నగరంలోని జిన్నా టవర్ సెంటర్ పేరు మార్చాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దేశద్రోహుల పేర్లు ఎక్కడున్నా తొలగించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరిట టవర్‌తో పాటు ఆ ప్రాంతానికి జిన్నా పేరు ఎలా కొనసాగిస్తారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. దేశ విభజనకు కారణమైన వ్యక్తి పేరు ఇంకా కొనసాగటం…