అనుమతి లేకుండా పీవీ సింధు ఫోటో ఉపయోగించినందుకు 20 కి పైగా బ్రాండ్‌లకు నోటీసులు పంపింది బేస్ లైన్ వెంచర్స్. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన సింధు ఇమేజ్‌ని వాడుకున్నట్లు ఆరోపణలు చేసారు. పలు బ్రాండ్లు ఒలింపిక్స్ మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించారని ఆరోపించింది. నిబంధనలను ఉల్లంఘించిన ప్రతి బ్రాండ్ నుండి 5 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని కోరుతూ లీగల్ నోటీస్ పంపారు. అధికారికంగా, IOC భాగస్వాములైన బ్రాండ్‌లు మాత్రమే, ఈ ఫోటోలు ఉపయోగించడానికి అనుమతించబడతాయి.…