తెలుగునాట పురుడు పోసుకున్న ఓ కథ, హిందీలో తిరిగి వస్తే, మళ్ళీ దానిని పట్టుకొని సినిమాలు తీసిన వారున్నారు. అలాంటి సినిమాల్లో ఒకటి ‘భార్యాబిడ్డలు’. నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 1953లో నటించిన ‘బ్రతుకు తెరువు’ ఆధారంగానే ‘భార్యాబిడ్డలు’ రూపొందింది. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై తాతినేని రామారావు దర్శకత్వంలో ఏ.వి.సుబ్బారావు నిర్మించిన ‘భార్యాబిడ్డలు’ 1972 జనవరి 15న విడుదలయింది. ‘భార్యాబిడ్డలు’ కథ విషయానికి వస్తే – మోహన్ కు పెళ్ళయి భార్యాబిడ్డలు ఉంటారు. వారితో పాటు చిన్నతమ్ముళ్ళు,…