Tobacco Packet: దుర్గదేవి నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి నైవేద్యం కోసం తయారు చేస్తున్న పాయసంలో బెల్లం ముక్కల మధ్య నిషేధిత పొగాకు (అంబర్) ప్యాకెట్ బయటపడటం భక్తులను షాక్‌కు గురి చేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలో జరిగింది. అన్నపూర్ణ దేవి అవతారంలో అమ్మవారికి అన్న ప్రసాదం పెట్టేందుకు భక్తులు పరవాన్నం (పాయసం) సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో బెల్లాన్ని కరిగించేందుకు ప్రయత్నిస్తుండగా దాని మధ్యలో అంబర్ ప్యాకెట్ ఉన్నట్లు గుర్తించారు.…