ఉత్తర ప్రదేశ్‌లోని మధుర జిల్లా బృందావన్‌లోని బాంకే బిహారీ ఆలయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఇందులో.. కొంతమంది భక్తులు ఆలయం వెనుక భాగం నుంచి కారుతున్న నీటిని చరణామృతంగా భావించి తాగడం కనిపిస్తుంది. నిజానికి ఇది ఆలయంలో ఏర్పాటు చేసిన ఏసీ నుంచి విడుదలయ్యే నీరు.
Vrindavan Temple Corridor: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బృందావన్ టెంపుల్ కారిడార్ పై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఈ టెంపుల్ కారిడార్ వల్ల తాము నిరాశ్రయులం అవుతామని.. తమ జీవనాధారం దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తామంతా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు తెలపడంతో పాటు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ కు రక్తంతో లేఖలు రాస్తున్నారు. ఈ…