ICC vs Bangladesh: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యంత సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు సమాచారం. టోర్నమెంట్ భారత్‌లోనే జరుగుతుందని స్పష్టంగా చెప్పడంతో, బీసీబీ ఆ నిర్ణయాన్ని నిరాకరించడంలో రాజకీయ దురుద్దేశం దాగి ఉందని ఐసీసీ అనుమానిస్తోంది.