Chinmoy Krishnadas: హిందూ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్‌లో అరెస్టు చేశారు. అయితే, ఆయనపై తాజాగా మరో కేసు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో హిందూ సన్యాసి మద్దతుదారులు, పోలీసులకు మధ్య గొడవ జరగడంతో కృష్ణదాస్ సహా 164 మందిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.
ఒక ఇస్లామిస్ట్ సంస్థ నాయకుడిని ఢాకాలోని అతని రహస్య స్థావరం వద్ద బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. సమూహంపై అణిచివేత ప్రారంభించిన నెలల తర్వాత శనివారం అధికారులు తెలిపారు.