తండ్రి నాగార్జున అక్కినేనితో మరోమారు నాగచైతన్య కలసి నటిస్తున్నాడు. వీరిద్దరూ నటించే చిత్రం ‘బంగార్రాజు’ షూటింగ్ మొదలయింది. నాగార్జున ద్విపాత్రాభినయంతో రూపొందిన ‘సోగ్గాడే చిన్నినాయనా’కు ప్రీక్వెల్ గా ‘బంగార్రాజు’ తెరకెక్కనుంది. 2016 సంక్రాంతి సందడిలో తనదే పైచేయి అని ‘సోగ్గాడే చిన్నినాయనా’ చాటుకుంది. ఇప్పుడు ఆ సినిమా ప్రీక్వెల్ అంటే అక్కినేని అభిమానులకు పండగే మరి! పైగా ఇందులో నాగచైతన్య కూడా నాగార్జునతో కలసి నటించడమంటే ఫ్యాన్స్ కు డబుల్ ధమాకాయే! ఇంతకు ముందు నాగార్జున, నాగచైతన్య…