అంతా తూచ్ తమ మధ్య ఎలాంటి విభేదాల్లేవని ఆ ఇద్దరు నేతలు ప్రకటించారు. అంతా సోషల్ మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. పార్టీ కోసం పని చేస్తున్నామని అన్నారు. ఎందుకు ఆ ఇద్దరు నాయకులు ఇంతలా చెబుతున్నారు? నిప్పు లేందే పొగరాదా?. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే తెలంగాణ భారతీయ జనతా పార్టీలోనూ నేతల ప్రచ్చన్నయుద్దాలు కొత్తేమీ కాదు. లుకలుకలు…లకలకలు అప్పుడప్పుడు కేక పెడుతుంటాయి. కొంతమంది ముఖ్య నేతల మధ్య అసలేమాత్రం పొసగడం లేదని పార్టీలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న…
కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని పిచ్చోళ్లుగా ముద్రవేసి వదిలేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం హిందూ దేవాలయాలు, హిందువులపై మాత్రమే పిచ్చోళ్లు దాడులు చేస్తరా? ఇతర ప్రార్ధన మందిరాల జోలికి వెళ్లరా? అని ప్రశ్నించారు.