కరీంనగర్ జిల్లా జైల్లో ఉన్న బండి సంజయ్ కి నిన్న రాత్రి బెయిల్ మంజూరైంది. సుదీర్ఘ వాదోపవాదాల తరువాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరి పూచీకత్తుతో నిన్న రాత్రి 10 గంటలకు రిలీజ్ ఆర్డర్ కోర్టు ఇచ్చింది.
బాసర ట్రిపుల్ ఐటి క్యాంపస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వందలాది మంది బీజేపీ కార్యకర్తలు క్యాంపస్‌లోకి దూసుకు రావడంతో.. ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. క్యాంపస్ లోనికి అనుమతించకపోవడంతో.. క్యాంపస్ ఎదుట బీజేపీ నేతల ధర్నాకు దిగారు. క్యాంపస్‌లోకి ఎవరినీ రానీయకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ బీజేపీ నేతలు దూసుకురావడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీకీ వస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు…