ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ అనుకున్న ప్రకారం జూన్ 4న రిలీజవుతుందా ? అంటే ఇప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ సిరీస్ మీద చెలరేగిన వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. ఈ సిరీస్‌లో సమంత పోషించిన ఎల్టీటీఈ టెర్రరిస్ట్ పాత్ర విషయంలో తమిళులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళ టైగర్లను చెడుగా చూపిస్తూ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు చూపిస్తున్నారన్నది వారి వాదన. దీనిపై వైగో అనే ఎంపీ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి…