Assam: బహుభార్యత్వాన్ని నిషేధించేందుకు అస్సాంలోని హిమంత బిశ్వసర్మ సర్కార్ సిద్ధమైంది. దీనికి వ్యతిరేఖంగా అసెంబ్లీలో బిల్లు పెట్టనుంది. డిసెంబర్‌లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరి కన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడాన్ని ఈ బిల్లు నిషేధించనుంది.