విద్యా సంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తన తీర్పును రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.