India Canada: ఇండియా కెనడాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇరు దేశాల మధ్య దౌత్యవివాదానికి కారణమైంది. ఈ హత్యలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో సహా ఆరుగురికి ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడంతో ఒక్కసారిగా వివాదం మొదలైంది. కెనడా ఆరోపణల్ని కొట్టిపారేసిన ఇండియా, కెనడా నుంచి తన రాయబారుల్ని ఉపసంహరించుకుంది.