Multiple blasts in Pakistan's Balochistan kill five:పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఆదివారం బలూచిస్థాన్ ప్రావిన్సులో పలు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు పాకిస్తాన్ సైనికులు మరణించారు. 12 మంది పౌరులు గాయపడ్డారు. డిసెంబర్ 24 నుంచి పాక్ ఆర్మీ, ఇతర భద్రతా బలగాలు బలూచిస్తాన్ వ్యాప్తంగా ఇంటలిజెన్స్ సమాచారంతో ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.