మెదక్ పార్లమెంట్ టీడీపీ కమిటీ సమావేశానికి హాజరైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కిన నరసింహులు అధికార టీఆర్‌ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తాన్నారు. కేసీఆర్ తెలంగాణ రాదనుకుని దళితుడిని సీఎం చేస్తానని అన్నారన్నారు. సీఎం ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటున్నాడని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారన్నారు. అంటరాని తనాన్ని రూపు మాపిన వ్యక్తి ఎన్టీఆర్ అని, త్వరలోనే టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని…