Operation Sindoor: కుటుంబ సభ్యుల్ని చంపితే ఎలా ఉంటుందో పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇప్పుడు తెలిసి వస్తోంది. పహల్గామ్‌లో అమాయకులైన 26 మందిని చంపి, వారి కుటుంబాల్లో తీరని వేధనను మిగిల్చిన ముష్కరులకు ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ ధీటుగా బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత్, పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.