Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం అమెరికాకు సవాల్ విసిరింది. ట్రంప్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్థాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలను చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై అఫ్ఘానిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. అమెరికా ప్రయత్నాలను ఒక బూటకమని పేర్కొన్నారు. అమెరికన్లకు ఆఫ్ఘన్ భూమిలో ఒక్క ముక్క కూడా లభించదని ఆయన స్పష్టం చేశారు. బాగ్రామ్ వైమానిక స్థావరం ఇప్పుడు తాలిబన్ ప్రభుత్వ నియంత్రణలో ఉందని, ఆఫ్ఘాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక…