దేశంలోని పలు ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీలోని బద్వేల్, తెలంగాణలోని హుజురాబాద్ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కోడ్ ఉల్లంఘనలు జరుగుతుండటంపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. ఎన్నికలు జరిగే నియోజకవర్గంపై ప్రభావం చూపేలా పక్క నియోజకవర్గాలలో పలు రాజకీయ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. Read Also: బద్వేల్ ఉపపోరు…ఆ రెండు పార్టీలకు షాక్…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కోచోట ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో తెలంగాణలోని హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ పోరు ఉత్కంఠగా మారింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని కడపలో జిల్లాలోనూ ఉప ఎన్నిక జరుగుతోంది. వైసీపీకి చెందిన బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అకాల మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు ఏకపక్షమేననే టాక్ విన్పిస్తోంది. తెలంగాణలోని హుజూరాబాద్ లో ఐదు…
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే చనిపోవడంతో ఈ ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికలకు ఇప్పటికే దూరంగా ఉండనున్నట్లు చనిపోయిన వ్యక్తి సతీమణిని గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నామని, ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని కోరుతున్నట్టు పవన్ పేర్కొన్నారు. అయితే బద్వేలు ఉప ఎన్నికకు దూరం ఉండనున్నట్లు టీడీపీ కూడా తాజాగా ప్రకటించింది. ఈరోజు పొలిట్ బ్యూరోలో ఈ నిర్ణయం తీసుకుంది టీడీపీ.…
బద్వేల్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. ఇవాళ క్యాంపు కార్యాలయంలో.. పార్టీ అభ్యర్తి డాక్టర్ సుధ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు కీలక సూచనలు చేశారు. బద్వేల్ ఉప ఎన్నికకు పార్టీ ఇన్‌ఛార్జిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారని తెలిపిన ఆయన.. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలని ఆదేశించారు.. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య…
కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడంతో.. సీఎం సొంత జిల్లా కడపలోని బద్వేల్ నియోజకవర్గంవైపు ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది.. ఇప్పటికే అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సుధను ప్రకటించింది. ఇక, బద్వేల్ ఉప ఎన్నికలపై కసరత్తు ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.. రేపు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలవనున్నారు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ, అభ్యర్థి సుధతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం…
బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడంతో.. అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్నాయి.. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం కాగా.. మరోసారి విజయంపై కన్నేసిన వైసీపీ.. బద్వేల్ అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధా పేరును ఖరారు చేయగా.. మరోవైపు.. పరిషత్ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం పరిధిలో వచ్చిన ఓట్లను బట్టి.. గట్టి పోటీ ఇవ్వగలమనే ధీమాతో.. బై పోల్‌పై ప్రత్యేకంగా…
దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి.. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.. అయితే, మరోసారి విజయంపై కన్నేసిన వైసీపీ.. బద్వేల్ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధా పేరును ఖరారు చేసింది.. మాజీ ఎమ్మెల్యే డాక్టర్…