కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ముగిసే సమయానికి ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతించనున్నారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఏంలను పోలింగ్ సిబ్బంది సీల్ చేస్తున్నారు. అనంతరం ఈవీంఏంలను భారీ భద్రతతో స్ట్రాంట్ రూంకి తరలించనున్నారు. అయితే సాయంత్రం 5 గంటలకు వరకు 59 గా పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారుల వెల్లడించారు. 2019లో 77 శాతం…
దేశవ్యాప్తంగా ఇవాళ 13 రాష్ట్రాల్లో 3 లోక్‌సభ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ నిర్వహిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి, తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.. అయితే, పోలింగ్ విషయంలో రెండు స్థానాల్లో స్పందన మాత్రం ఒకేలా లేదు.. హుజరాబాద్‌తో పోలిస్తే.. బద్వేల్ మాత్రం బాగా వెనుకబడింది.. ఇక, పోలింగ్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే.. హుజురాబాద్‌లో భారీగా పోలింగ్…
ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా దొంగ ఓట్ల కలకలం రేగింది. అట్లూరులో 10 మంది మహిళలు దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు. వారి వద్ద ఓటర్ స్లిప్పులు తప్ప ఆధార్ కార్డులు లేవని ఎన్నికల అధికారులు గుర్తించారు. దీంతో పోలీసులు వారిని ఓటు వేయనీయకుండా వెనక్కి పంపించారు. కాగా మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని పోలీసులు తెలిపారు. Read Also: బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ నేతలు మరోవైపు బద్వేల్…
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.. సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.. ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్ అయిన బద్వేల్‌లో మొత్తం రెండులక్షల 16వేల 206 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు లక్షా 8వేల 809 మంది, మహిళలు లక్షా 7వేల 375 మంది కాగా, థర్డ్ జెండ్ లో 22 మంది. ఇద్దరు మహిళలతో కలిపి మొత్తం 15 మంది అభ్యర్ధులు ఎన్నికల బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 281…
బద్వేల్ ఉపఎన్నికపై బీజేపీ లెక్కలేంటి? అధిష్ఠానం నేరుగా జోక్యం చేసుకున్న ఈ ఉపఎన్నికలో కమలనాథుల అంచనాలు ఎలా ఉన్నాయి? టీడీపీ పోటీలో లేకపోవడంతో.. ఆ పార్టీ ఓటు బ్యాంక్‌పై బీజేపీ పెట్టుకున్న ఆశలేంటి? 2019లో బీజేపీకి వచ్చిన ఓట్లు 735 బద్వేల్ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా బలం లేదు. కేడర్ కూడా అంతంత మాత్రమే…! 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 735. నాడు బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి వైసీపీ నుంచి…
బద్వేల్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 7గంటలకు భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఉప ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. పోలింగ్ కు 72 గంటల ముందు నుంచే ఈ ప్రచారాలు ముగియడంతో మైకులు మూగబోయాయి. అయితే ఈ మేరకు జిల్లా కలెక్టర్ విజయరామారాజు, ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ.. బద్వేల్ నియోకవర్గంలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 281 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ పోలింగ్…
ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతోన్న ఉప ఎన్నిక కాక రేపుతోంది.. బీజేపీ మండల అధ్యక్షుడు ఇప్పుడు వైసీపీలో చేరడం హీట్ పెంచుతోంది… ఈ విషయాన్ని ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికే తీసుకెళ్లింది భారతీయ జనతా పార్టీ.. అధికార వైసీపీపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు జీవీఎల్, సునీల్ దేవధర్. బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, హింస, బెదిరింపులు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోంది…
బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అన్ని అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ, మంత్రి పెద్దిరెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. అధికార పార్టీ యథేచ్చగా బెదరింపులకు పాల్పడుతుందని విమర్శించిన బీజేపీ ఎంపీ.. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డితో సహా బెదరింపులకు దిగుతున్నారని.. బీజేపీ మండల…
కడప జిల్లాలో ఈ నెల 30న జరగనున్న బద్వేల్ ఉప ఎన్నికలపై బీజేపీ సీరియస్ అయింది. కడప నగరంలోని ఆర్.అండ్.బీ అతిథి గృహంలో కేంద్ర ఎన్నికల పరిశీలకులు భీష్మ కుమార్ ను కలిసి బీజేపీ రాష్ట్ర అద్యక్ష్యులు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. ఎన్నికల పరిశీలకులను కలిసిన వారిలో జాతీయ కార్యదర్శి సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, జీవీఎల్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వున్నారు.…
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో బీజేపీ తరుఫున ప్రచారం చేసేందుకు కేంద్ర పశు సంవర్థక, మత్స్య, సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ రానున్నారు. తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బద్వేల్ కు కేంద్ర మంత్రి మురుగన్ చేరుకోనున్నారు. అనంతరం తొలుత పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకూ రోడ్ షోలో పాల్గొని, నాలుగు రోడ్ల కూడలిలో ఆయన ప్రసంగించనున్నారు.…