ఈ ఆధునిక యుగంలో ఇంకా శిశువులను అంగడి సరుకుల మాదిరిగా విక్రయిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శిశు విక్రయాల గతంలో అనేక ప్రాంతాల్లో వెలుగు చూశాయి. నవ మాసాలు మోసి కన్నబిడ్డలను తమ అవసరాల కోసం అమ్మేస్తున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పసి బిడ్డ విక్రయం ఘటన బాపట్లలలో చోటుచేసుకుంది.