Baby Born In Bus: రాజస్థాన్ రాష్ట్రంలోని భివాడిలో అల్వార్ – భివాడి హైవేపై పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులో ఒక మహిళా మగ బిడ్డకి జన్మనిచ్చింది. అల్వార్ చేరుకోకముందే ఆ మహిళకు ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపేశాడు. బస్సులో కూర్చున్న ప్రయాణికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఈ సమయంలో అంబులెన్స్ రాకముందే మహిళ బస్సులోనే ప్రసవించింది. ఇక ప్రసవం తర్వాత ఆ తల్లి, బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు.…