Canada: ఖలిస్తానీ ఉగ్రవాదులకు, వారి సంస్థలకు కెనడా ప్రభుత్వం ఎప్పటి నుంచో మద్దతుగా నిలుస్తుందో అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో, ఖలిస్తానీ ఉగ్రవాదుల కోసం భారతదేశంతో ఉన్న దౌత్య సంబంధాలను కూడా రిస్క్‌లో పెట్టాడు. అయితే, తొలిసారిగా, కెనడా నిజాన్ని ఒప్పుకుంది.
Khalistani Terrorists: భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ పవిత్తర్ సింగ్ బటాలాను, మరో ఏడుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులను అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) కిడ్నాప్ కేసులో అరెస్టు చేసింది. బటాలా నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సంబంధాలను కలిగి ఉన్నాడు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు భారతదేశం ఇతడిని కోరుతోంది.
Kapil Sharma: ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ కేఫ్‌పై ఖలిస్తానీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కెనడాలో కేఫ్ ప్రారంభించిన కొన్ని రోజులకే ఈ ఘటన జరిగింది. కనీసం, 9 రౌండ్ల కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డీ ఈ కాల్పులకు బాధ్యత వహించారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.