అక్కడ ప్రత్యర్థులతో పని లేకుండా టీడీపీలోని రెండు వర్గాలే గుద్దులాటకు దిగుతున్నాయా? సాక్షాత్తు ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలోనే నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేదాకా వ్యవహారం వెళ్ళిందా? పార్టీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ నియోజకవర్గంలో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోందా? ఏదా సెగ్మెంట్? ఎవరా ఇద్దరు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట పులివెందుల. గడిచిన 45 ఏళ్ళుగా వైఎస్ కుటుంబానిదే ఇక్కడ హవా. అలాంటి కోటను ఎందుకు బద్దలు కొట్టకూడదు? పసుపు జెండా ఎందుకు ఎగరేయకూడదన్నది…