అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేసి విజయాలను అందుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. ఏదో ఒకరోజున తాను సినిమాకు దర్శకత్వం వహిస్తానని ముందుగానే చెప్పి, మరీ దర్శకురాలిగా మారారు బి.జయ. అసలే పురుషాధిక్య ప్రపంచంలో అందునా సినిమా రంగంలో ఎలా రాణిస్తావు? అని ఎందరో ఆమెను ప్రశ్నించిన వారున్నారు. వారందరికీ మెగాఫోన్ పట్టి సమాధానం చెప్పారామె. తెలుగు చిత్రసీమలో దర్శకత్వంలో రాణించే మహిళలు అరుదు. అలాంటి పరిస్థితుల్లో దర్శకురాలిగా తనదైన బాణీ పలికించి భళా అనిపించారు జయ. కలిదిండి…