కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంతి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. శబరిమలలో అయ్యప్పస్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్రప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Sabarimala: శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు కేరళ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తడంతో స్వామివారి దర్శనంలో జాప్యం జరుగుతోంది.
Heavy rains continue to lash Kerala: గత రెండు రోజులుగా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2-3 రోజుల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఒక ప్రకటనలో తెలిపింది. తమిళనాడు మీదుగా పశ్చిమ దిశగా కదులుతున్న తుఫాను కారణంగా.. దక్షిణ భారతదేశంలోని దక్షిణ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక…
అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమల వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది.
Bus Accident: తమిళనాడు నుంచి కేరళలోని శబరిమలకు అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 64 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు.
Bairi Naresh: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు భైరి నరేష్ పై మరోసారి దాడి జరిగింది. హనుమకొండ జిల్లా గోపాల్ పూర్ లో భైరి నరేష్ పై అయ్యప్ప భక్తులు దాడి చేశారు.
అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శబరిమలకు మరో 28 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అయ్యప్ప భక్తులతో రైళ్లకు తాకిడి పెరగడంతో దక్షణిమధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. కాచిగూడ, హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ స్టేషన్‌ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడువనున్నట్లు తెలుస్తోంది. జనవరి…