టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటి కూల్చివేత పై హైకోర్టు స్టే విధించింది. అయ్యన్న ఇంటి కూల్చివేత పై ఆదివారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఆయన తరపు న్యాయవాదులు. అర్థరాత్రి వాదనలు ముగిశాయి.జలవనరుల శాఖ గతంలో అనుమతి ఇచ్చినప్పటికీ ఎటువంటి నోటీసు లేకుండా ఇల్లు కూల్చివేస్తున్నారని వాదనలు వినిపించారు. దీంతో వాదనలు విన్న అనంతరం హైకోర్ట్ అయ్యన్న ఇంటి దగ్గర కూల్చివేతపై స్టే…
విశాఖ జిల్లా నర్సీపట్నంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రసాభాస జరిగింది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ప్రజలకు దగ్గరకు వెళ్లిన సమయంలో కొందరు ఆయన్ను అడ్డుకున్నారు. తమకు అమ్మ ఒడి రావడం లేదని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. మహిళలు సమస్యలు చెప్తుండగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తనను నిలదీసిన వాళ్లంతా టీడీపీ సభ్యులేనని వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై బూతుపదజాలం…
అనకాపల్లి జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. పోలీసులను దుర్భాషలాడటం, దురుసుగా ప్రవర్తించడంపై అధికారులు విచారించి సెక్షన్ 353తో పాటు మరికొన్ని సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే… రెండు రోజుల క్రితం నర్సీపట్నం గ్రామదేవత ఉత్సవాల్లో కొందరు యువకుల దూకుడు కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ రాత్రి 11 గంటల తర్వాత జరపడానికి వీల్లేదంటూ…
ఏపీలో ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు టీడీపీ నేత నారా లోకేష్. ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజారెడ్డి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయ్యన్నపాత్రుడు మొదటిసారి మంత్రి అయ్యేటప్పటికి జగన్ పాలుతాగుతున్నాడు.అయ్యన్నపాత్రుడు ని ఎదుర్కోలేక ముఖ్యమంత్రి పోలీసులను పంపిస్తున్నారని విమర్శించారు. ఇక్కడ పోలీసులు మోహరింపు, నిర్బంధం చూస్తే నర్సీపట్నంలో ఉన్నామా ఉక్రెయిన్లో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు లోకేష్. అయ్యన్నపాత్రుడు పై 9 కేసులు పెట్టారు….అందులో నిర్భయ చట్టం కింద ఉండటం దారుణం. ఇప్పటి వరకు…