ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి ఘనా చేరుకున్నారు. ఇది పశ్చిమ ఆఫ్రికా దేశానికి ఆయన తొలి ద్వైపాక్షిక పర్యటన. మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఘనాకు వెళ్లడం ఇదే తొలిసారి. అక్రలోని కోటోకా అంతర్జాతీయ విమానాశ్రయంలో మోడీకి ఘనా స్వాగతం పలికి 21 తుపాకీలతో గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా, ప్రధాని మోడీకి ఘనా రెండవ జాతీయ అత్యున్నత పౌర గౌరవం లభించింది. ఘనా అధ్యక్షుడు జాన్…