రామ మందిరం ప్రారంభోత్సవానికి అయోధ్య భక్తులందరికి పిలుపునిస్తోంది. జనవరి 22న దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. ఈ మేరకు యూపీ ప్రభుత్వం కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ నుంచి రాష్ట్రాల సీఎంలకు, ప్రముఖ రాజకీయ నేతలకు ఆహ్వానం అందింది. ఇక తమిళనాడు నుంచి రాముని గుడి గంటలు కూడా బయలుదేరాయి. పలువురు భక్తులు రామయ్యకు కానుకలు సమర్పిస్తూ భక్తిని చాటుకుంటున్నార. మరోవైపు భక్తులు అయోధ్యకు పాద్రయాత్ర చేపడుతున్నారు. ఈ క్రమంలో రామయ్య సేవకు నేను సైతం అంటూ ఓ ముస్లిం యువతి కూడా కదిలింది.
Also Read: TS Inter Exam Fee: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే..?
ముంబై నుంచి అయోధ్యకు నడకయాత్రం చేపట్టి సర్వమత సమానత్వాన్ని చాటి చెప్పింది. రామునిపై భక్తి ఉండాలంటే హిందువే కానవసరం లేదంటూ ముంబై నుంచి అయోధ్యకు 1,425 కిలోమీటర్ల దూరం కాలినడకన బయలుదేరింది. ఆ యువతి పేరు షేక్ షబ్నం. ప్రస్తుతం షబ్నం దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా మారింది. ఇక సోషల్ మీడియా, మీడియాల్లో ఆమె గురించే చర్చించుకుంటున్నారు. పుట్టుకతోనే ముస్లిమైన షబ్నం.. రాముని పట్ల అచంచలమైన భక్తితో అయోధ్యలో కొలువుదీరనున్న రామున్ని దర్శించుకోవడానికి కాలినడకనే వెళ్లాలని నిర్ణయించుకుంది. తన సహచరులు రామన్ రాజ్ శర్మ, వినీత్ పాండేలతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభించింది. శ్రీరాముడు పాటించిన విలువలు, ఆచరణ ఎందరికో స్ఫూర్తి అంటుంది.
అలాంటి రామయ్యాను ఆరాధించేందుకు హిందువే కానవసరం లేదని గర్వంగా చెబుతోంది. మంచి మనిషిగా ఉండడమే ముఖ్యమంటూ అయోధ్యకు పయనమైంది. అలా నడకయాత్రన షబ్నం ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని సింధవకు చేరుకుంది. ప్రతిరోజూ 25-30 కిలోమీటర్లు మేర నడుస్తూ ముంబై నుంచి ఇప్పటికి మధ్యప్రదేశ్‌కు చేరుకుంది. ఈ సుధీర్ఘ యాత్రలో అలసట వచ్చినప్పటికీ రామునిపై ఉన్న భక్తే తనని నడిపిస్తోందని షబ్నమ్ తెలిపింది. మతంతో సంబంధం లేకుండా రాముడు అందరివాడనే ప్రేరణ కలిగించడానికే యాత్రను చెపట్టినట్లు పేర్కొంది. అబ్బాయిలు మాత్రమే ఇలాంటి కష్టతరమైన యాత్రలు చేయగలరనే అపోహను పొగోడతానంది. ఈ క్రమంలో ఆమె యాత్రం ఎంతోమంది పలకరిస్తూ షబ్నమ్‌కు కొనియాడుతున్నారు. ఆమెతో సెల్ఫీలు తీసుకుంటున్నారు.
Also Read: Vijay: షాకింగ్.. విజయ్ పైకి చెప్పు విసిరిన గుర్తుతెలియని వ్యక్తి.. వీడియో వైరల్
అంతేకాదు అవసరమైతే తనకు కావాల్సిన సాయం కూడా చేస్తామంటున్నారు. అయితే షబ్నమ్ పాదయాత్రకు సవాళ్లు తప్పలేదు. ఆమెకు భద్రత కల్పించడమే కాకుండా భోజనం, వసతి ఏర్పాట్లు కల్పించడంలో పోలీసులు కీలకంగా వ్యవహరించారు. సున్నితమైన ప్రాంతాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. సోషల్ మీడియాలో కొందరు ద్వేషిస్తున్నా.. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. విశేష స్పందనలు ప్రోత్సాహాన్నిస్తున్నాయని ఆమె చెబుతుంది. రాముని జెండాను పట్టుకుని నడుస్తున్నప్పుడు ముస్లింలతో సహా అనేక మంది ‘జై శ్రీరామ్’ అని నినాదించిన ఆనంద క్షణాలను అనుభవించానని షబ్నమ్ చెబుతోంది.