ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ రోగి చేతులు, కాళ్లను కట్టేసి.. అతడిని చికిత్స చేసే రూంలో కాకుండా.. వేరే వార్డులో ఉంచి అతడి భోజనం పెడుతున్నారు. అయితే ఆసుపత్రి సిబ్బంది మాత్రం అతడి మానసిక స్థితి బాగాలేదని వెల్లడించారు. కానీ అతడి డయాబెటిస్ మాత్రమే ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో అతడిని లక్నోలోని ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే మార్గమధ్యలో రోగి మరణించాడు.…