Naa Anveshana : సోషల్ మీడియా వేదికగా తెలుగు యూట్యూబర్స్ మధ్య యుద్ధం ముదురుతోంది. ప్రముఖ ట్రావెల్ బ్లాగర్ అన్వేష్, పాపులర్ యూట్యూబర్ ‘ఏయ్ జూడ్’ అజయ్ మధ్య మొదలైన వివాదం ఇప్పుడు తీవ్రస్థాయికి చేరింది. హిందూ దేవతలపై అన్వేష్ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న అన్వేష్, ఇటీవల హిందూ దేవతలను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై హిందూ భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం…