అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించి మరణాల సంఖ్యపై ఓ క్లారిటీ వచ్చేసింది. తొలుత ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. కానీ.. ఆ సంఖ్య ఇప్పుడు 260కి చేరుకుంది.
Gujarat Govt : దేశ చరిత్రలో అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది. దేశంలోనే అతిపెద్ద విమాన ప్రమాదంగా ఇది నిలిచింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 275 మంది చనిపోయినట్టు గుజరాత్ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఇందులో 241 మంది ప్రయాణికులు ఉండగా.. 34 మంది స్థానికులు ఉన్నట్టు గుజరాత్ ఆరోగ్యశాఖ స్పస్టం చేసింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పుడే అధికారికంగా గుజరాత్ ఈ వివరాలను వెల్లడించింది. Read Also : Rammohan…
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, అలాగే ప్రాణాలతో బయటపడిన వ్యక్తికి తక్షణ ఆర్థిక అవసరాలను నిమిత్తం రూ.25 లక్షల తాత్కాలిక పరిహారాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రూ. 1 కోటి ప్రకటించిన విషయం తెలిసిందే.
అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన కొన్ని భయానక ఫొటోలను ఇప్పుడు చూద్దాం..
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం AI171 ప్రమాదానికి సంబంధించి ఇద్దరు వైద్యులు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తక్షణమే సుమోటోగా విచారణ చేపట్టి, బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు (ఇందులో అహ్మదాబాద్‌లోని బిజె మెడికల్ కాలేజీ రెసిడెంట్ వైద్యులు కూడా ఉన్నారు) ఒక్కొక్కరికి రూ.50 లక్షల మధ్యంతర పరిహారాన్ని వెంటనే ప్రకటించాలని, వెంటనే పంపిణీ చేయాలని పేర్కొన్నారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ విమానం దగ్గర్లోని బీజే మెడికల్ కాలేజీ భవనంపై కుప్పకూలింది. విమానంలోని 241 ప్రయాణికులే కాకుండా.. హాస్టల్‌లో ఉన్న 24 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఓ ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ విమాన ప్రమాదం చాలా దారుణంగా మారింది. 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఒక ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం ఎలా జరిగింది? టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే విమానం ఎలా కూలిపోయింది? దీనికి కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.