Avadh Ojha: ఐఏఎస్, ఐపీఎస్ వంటి యూపీఎస్సీ కోచింగ్‌కి పేరు తెచ్చుకున్న ప్రముఖ విద్యావేత్త అవధ్ ఓజా ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. తాజాగా ఆయన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కేజ్రీవాల్‌ని దేవుడితో పోల్చారు. ఒక ఇంటర్వ్యూలో ఓజా ఈ వ్యాఖ్యలు చేశారు.