భారతీయ కార్ మార్కెట్‌లో ఎస్‌యూవీ కార్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది.. ఈ దృష్ట్యా, హ్యుందాయ్ తన కొత్త SUV ఎక్స్‌టర్‌ను త్వరలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే ఈ కారు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే వెహికిల్స్ వైపు దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో సందడి చేస్తుండగా.. ఛార్జింగగ్ పాయింట్ల కొరత ఉండటంతో పాటు ఛార్జింగ్ అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పెట్రోల్ వేగంగా ప్యూయల్ నింపుకొని వెళ్లగలిగే కార్ల విషయానికొస్తే CNG ఒక ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు.
షియోమి నుంచి 2024లో మొదటి ఎలక్ట్రిక్ వాహనంతో పాటు ఉత్పత్తిని ప్రారంభిస్తుందని వెల్లడించింది. చైనా వార్షిక పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతున్న షియోమి సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ జున్ ఈ టాపిక్ ను వెల్లడించారు. 2022 నాటికి కంపెనీ తన ఈవీ వెంచర్ లో మూడు బిలియన్ యువాన్లను(434.3 మిలియన్ డాలర్లు ) పెట్టుబడి పెట్టిందని, కంపెనీ తన సమయంలో సగ భాగం షియోమీ ఈవీ కారు వ్యాపారం గురించే ఖర్చు చేస్తోందని ఆయన తెలిపారు.
5-Door Mahindra Thar: స్వదేశీ ఆటోెమేకర్ మహీంద్రా వరసగా తన కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తోంది. ఇటీవల తన ఎలక్ట్రిక్ కార్ విభాగంలో మహీంద్రా ఎస్‌యూవీ 400ను తీసుకువచ్చింది. ఇప్పటికే ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ థార్ తో సంచలనాలు నమోదు చేసింది. దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇటీవల 4×2(ఆర్ డబ్ల్యూ డీ) థార్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు మహీంద్రా థార్ 5 డోర్ ఎస్‌యూవీని తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఉన్న 3 డోర్…
Toyota Innova Hycross unveil on November 25: ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ కార్లలో టొయోటా ఇన్నోవా ఒకటి. ఎంపీవీ మోడళ్లలో ఇన్నావాకు ఉన్న క్రేజే వేరు. టొయోటా కంపెనీ ఇన్నోవా క్రిస్టా పేర్లలో తన ఎంపీవీ వాహనాలను తీసుకువచ్చింది. ఇండియాలో ఈ కారు విపరీతంగా అమ్ముడైంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టొయోటా తన ఇన్నోవా హైక్రాస్ కారును ఇండియన్ మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. నవంబర్ 25న ఇన్నోవా హైక్రాస్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. గతంలో…
దేశీయ ఆటోమొబైల్స్ దిగ్గజం టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరలను 0.55 శాతం పెంచింది. జూలై 9 నుంచి అన్ని కార్లు, ఇతర ప్యాసింజర్ వాహనాల ధరలు వేరియంట్ ను బట్టి సుమారుగా 0.55 శాతం పెంచింది. టాటా మోటార్స్ గతంలో కొన్ని నెలల క్రితం ఇలాగే తన వాహనాల ధరలను పెంచింది. తాజగా మరోసారి ప్యాసింజర్ వెహికిల్స్ ధరలను పెంచింది. పెరిగిన తయారీ ఖర్చులకు అనుగుణంగా ఈ నిర్ణయం…