పండుగలు వచ్చిందంటే చాలు.. యథేచ్ఛగా ప్రైవేటు ప్రజారవాణా సంస్థలు డబ్బులు దండుకోవడానికి సిద్ధమవుతుంటాయి. ప్రైవేటు ట్రావెల్స్ ధనదాహానికి సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శివారు పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగు రోడ్డుపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాటిపై అధికారుల బృందం కేసులు నమోదు చేస్తోంది. అంతేకాకుండా సంక్రాంతి పండుగ నేపథ్యంలో…