ప్రధాని నరేంద్ర మోడీ జులై 8 నుంచి 10 వరకు రష్యా, ఆస్ట్రియాల్లో అధికారిక పర్యటనకు వెళ్లనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం వెల్లడించింది. 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ జులై 8 , జులై 9 తేదీల్లో మాస్కోలో పర్యటించనున్నారు