ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రాణించిన విషయం తెలిసిందే. మొదటి వన్డేలో 8 పరుగులే చేసిన రోహిత్.. రెండో వన్డేలో 73 రన్స్, మూడో వన్డేలో 121 పరుగులు చేశాడు. చివరి వన్డేలో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన హిట్‌మ్యాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్’ అందుకున్నాడు. సిరీస్‌లో హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ కూడా సొంతం చేసుకున్నాడు. వన్డే సిరీస్ ముగియడంతో…