షేన్ వార్న్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వెల్లడించాడు. వార్న్ ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్ కాదంటూ ఈ సమయంలో తాను వ్యాఖ్యానించాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. నిజానికి ఇలాంటి సమయంలో టీవీ ఛానల్ వారు అలాంటి ప్రశ్న అడగాల్సింది కాదు.. తాను జవాబు చెప్పాల్సింది కాదని వివరించాడు. అయితే యాంకర్ అడిగిన ప్రశ్నకు తాను నిజాయితీగా తన అభిప్రాయం చెప్పినట్లు సన్నీ తెలిపాడు. క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లలో…