వన్డే ప్రపంచకప్ 2027లో ఆడాలని టీమిండియా సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు చూస్తున్నారు. అందుకు తగ్గట్టే సిద్ధమవుతున్నారు. రోహిత్ ఫిట్‌నెస్ సాధించి కుర్రాళ్లకు ధీటుగా మారాడు. ఇక విరాట్ నిత్యం లండన్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇద్దరు దిగ్గజాలు ప్రపంచకప్‌లో ఆడుతారని కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ పరోక్షంగా హింట్ ఇచ్చినా అందరికి అనుమానాలే ఉన్నాయి. రోహిత్, కోహ్లీలు మెగా టోర్నీలో ఆడడంపై తాజాగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ప్రపంచకప్‌కు ఇంకా రెండున్నరేళ్ల…