ఆడవారికి గుడ్ న్యూస్.. మూడు రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ లో ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 6,470 ఉంది. అలాగే.. 8 గ్రాముల బంగారం ధర రూ. 51,760 ఉంది. 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 64,700 గా ఉంది. నిన్నటి ధర కంటే.. ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్లపై బంగారం ధర రూ. 100 తగ్గింది.