ఎన్ని మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నా ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని టీడీపీ మండిపడింది. నెల్లూరులో టీడీపీ ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష నిర్వహించింది. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి, అసమర్థ నాయకుని పాలన ఎలా ఉంటుందో జగన్ ను చూస్తే అర్డంవుతుందన్నారు అనిత. వైసీపీ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. మహిళల్లో చైతన్యం తెచ్చేందుకే నారీ సంకల్ప దీక్ష చేపట్టాం అన్నారు. పాదయాత్రలో తల నిమిరి ముద్దులు పెట్టిన జగన్..…