ఇటీవల కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిపై ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. తాగిన మైకంలో ఒక వ్యక్తి విజయ్ సేతుపతి పీఏపై దాడి చేశాడు. అనంతరం అతడే క్షమించమని అడగడంతో ఈ గొడవ ముగిసింది. ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేయవద్దని సేతుపతి చెప్పడం చర్చనీయాంశంగా మారిన సంగతి కూడా విదితమే. ఇక తాజగా ఈ ఘటనపై విజయ్ సేతుపతి స్పందించారు. “అది ఒక చిన్న ఘటన.. ఎయిర్ పోర్ట్ లో…
హైదరాబాద్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు… ప్రేమకు నిరాకరించిన యువతిపై విచక్షణారహితంగా దాడి చేసినట్టుగా చెబుతున్నారు.. యువతి ఇంట్లోకి చొరబడి.. అమ్మాయి గొంతు, చేతులు, వెళ్లు, కాళ్లు, మనికట్టు ఇలా.. చాలా చోట్ల గాయపరిచాడు.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వట్టి నాగులపల్లిలో యువతి పై యువకుడి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.. యువతి ఇంటికి వచ్చి దాడి చేశాడు ప్రేమ్ సింగ్ అనే యువకుడు.. గొంతు, చేతులు, వెళ్లు, కాళ్లు..…
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ లోక్‌సత్తా నేతపై దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. లోక్‌సత్తా పార్టీకి చెందిన వెంకటరమణ రాయదుర్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కంట్లో కారం కొట్టి కర్రలతో దాడికి యత్నించారు. దీంతో వెంకటరమణ తన వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ వైపు పరుగులు తీశారు. వెంకటరమణను దుండగులు ద్విచక్ర వాహనాలపై వెంబడించినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కు…
ప్రముఖ దర్శక నిర్మాత ప్రకాశ్ ఝా ప్రస్తుతం ‘ఆశ్రమ్’ పేరుతో ఓ వెబ్ సీరిస్ తీస్తున్నారు. బాబీ డియోల్ కీలక పాత్ర పోషించిన ఈ వెబ్ సీరిస్ తొలి రెండు సీజన్స్ ఇప్పటికే ఎం.ఎక్స్. ప్లేయర్ లో స్ట్రీమింగ్ అయ్యాయి. ఈ ‘ఆశ్రమ్’ వెబ్ సీరిస్ లో బాబీ డియోల్ ఓ మోసకారి బాబా పాత్రను పోషిస్తుండటం విశేషం. ఈ వెబ్ సీరిస్ కథాంశం, బాబీ డియోల్ పోషిస్తున్న బాబా నిరాల పాత్ర హిందువుల మనోభావాలను దెబ్బతీసే…
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న టీడీపీ బంద్ కార్యక్రమంలో పాల్గొన కుండా బుచ్చయ్యరు గృహ నిర్బంధం చేశారు పోలీస్ అధికారులు. వైసిపి నాయకులు తమనేతల దిష్టిబొమ్మలు దహనం చేస్తుంటే పోలీసులు పర్మిషన్ ఇస్తారని, మా మీద జరిగిన దాడులు ఖండించడానికి మేము బయటకు వెళ్లకూడదా అని బుచ్చయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులను…
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఢిల్లీలోని అధికారిక నివాసంపై ఇవాళ దాడి జరిగింది.. ఒవైసీ అధికారిక నివాసంపైకి దూసుకెళ్లిన హిందూ సేన కార్యకర్తలు.. గేట్ దగ్గర హంగామా చేశారు.. నేమ్ ప్లేట్, ఇంటి బయటికి ఉన్న అద్దాలను పగలగొట్టారు. హిందువులకు వ్యతిరేకంగా ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తమ కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయని.. అందుకే అతని నివాసంపై దాడి చేశారని తెలిపారు హిందూ సేన అధినేత విష్ణు గుప్త.. కాగా, ఈ దాడిలో…
చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో పంట పొలాలపై ఏనుగులు గుంపులుగా వచ్చి తీవ్రంగా నష్టం చేకూరుస్తున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి ఏనుగుల దాటి చేయడంతో భారీగా పంటనష్టం జరుగుతోంది. తోటకనుమ గ్రామపంచాయితీ దండికుప్పం పంట పొలాలపై ఏనుగుల గుంపులుగా విరుచుకుపడుతున్నాయి. పూతదశలో పంటను తినేసిసిన 20 ఏనుగుల గుంపు.. పది ఎకరాలకుపైగా వరి పంటను నాశనం చేశాయి. సుమారు అయిదు లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు పట్టించుకోని, ఆదుకోవాలని…
మాదాపూర్ లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పై జరిగిన దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఉన్నత ఆధికారుల బంధువు కావడంతోనే విషయం బయటికి రాకుండా చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనికేలు నిర్వహిస్తున్న సమయంలో… మమల్ని ఆపుతావా అంటూ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పై నే చేయి చేసుకున్నారు ఇద్దరు వాహనదారులు. దాంతో ఈ ఘటన పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. అయితే ఆ ఇద్దరి పై కేసు…
భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. పరాయి పురుషులతో మాట్లాడనని హామీ పత్రం రాసివ్వాలని కత్తితో దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటుచేసుకొంది. రజాక్ అనే వ్యక్తికి అనంతపురం పట్టణానికి చెందిన షర్మిలతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లుగా రజాక్ భార్య షర్మిలపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె పరాయి పురుషులతో మాట్లాడడం సహించలేకపోయాడు. తరచూ ఆమెతో గొడవ పడ్డాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కోపంలో కత్తితో ఆమెపై దాడికి…
పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది… త్రిపురలో పర్యటిస్తున్నారు అభిషేక్ బెనర్జీ.. అయితే, ఆయన కాన్వాయ్పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడికి పాల్పడ్డారు.. వారు బీజేపీ జెండాలను పట్టుకుని ఉన్నారు.. అయితే, తనపై దాడికి పాల్పడింది బీజేపీ నేతలేనంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు అభిషేక్ బెనర్జీ.. బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది అంటూ మండిపడ్డ ఆయన.. విప్లవ్ దేవ్ మీరు…