రకుల్ ప్రీత్ సింగ్ తాజా ఫొటోలతో సమ్మర్ లో మరింత హీట్ ని పెంచేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సిల్వర్ కలర్ డ్రెస్ ధరించి స్టన్నింగ్ లుక్ లో మెరిసిపోతున్న రకుల్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ నటించిన బాలీవుడ్ మూవీ “ఎటాక్ పార్ట్ 1” విడుదలకు సిద్ధమవుతోంది. జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా కీలకపాత్రల్లో నటిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 1న థియేటర్‌లలోకి రానుంది.…
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం అయ్యవారిపల్లెలో దారుణం చోటుచేసుకుంది. సర్పంచి ఇంటిపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి, చాపాడు మండలం అయ్యవారిపల్లె గ్రామ పంచాయతీ సర్పంచి నివాసంపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో సర్పంచితో పాటు ఆయన సోదరుడి కుటుంబ సభ్యులు ఆరుగురు గాయపడ్డారు. అయ్యవారిపల్లె గ్రామ సర్పంచి కె. రహంతుల్లా నివాసంపై వైసీపీ నేతలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. రహంతుల్లా తిమ్మయ్యగారిపల్లెలోని నివాసంలో నిద్రిస్తుండగా దాడికి పాల్పడ్డారు. ఈ…
పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ను సౌత్ ప్రేక్షకులు వెండి తెరపై చూడక చాలా రోజులవుతోంది. ‘కొండపొలం’ తరువాత ఆమె నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. దీంతో రకుల్ ను ఆమె అభిమానులు చాలా మిస్ అవుతున్నారు. అందుకేనేమో తనను మిస్ అవుతున్న వారి కోసమే అన్నట్టుగా వరుసగా బికినీ పిక్ లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది రకుల్. తాజాగా రెడ్ బికినీలో ఆమె షేర్ చేసిన పిక్ కుర్రాళ్లలో సెగలు రేపుతోంది. ఇన్స్టాగ్రామ్…
అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ళ కిందట వివాహాం చేసుకున్న ప్రేమ జంటపై అమ్మాయి మేనమామ జహాంగీర్ గొడ్డలితో దాడి చేయడం కలకలం రేపుతోంది. ఈ దాడిలో వివాహిత భర్త రాజు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లష్కర్‌గూడ, సుర్మయ్‌గూడకు చెందిన రాజు అదే గ్రామానికి చెందిన మైనార్టీ యువతిని ఆరేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. Read Also:పంజాబ్ ఐకాన్‌గా ఉండను: సోనూసూద్ ఈ రోజు ఆస్పత్రికి…
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన మురళి అనే టీడీపీ కార్యకర్త ను కిడ్నాప్ చేసి తీవ్రంగా చితకబాది వదిలేశారు వైసీపీ నేత, రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ అనుచరులు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్ కి అని చెప్పి మురళి ని తీసుకెళ్ళారు సెంథిల్ కుమార్ అనుచరులు. ప్రస్తుతం కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు మురళి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ములకల పల్లె గ్రామానికి చెందిన మురళి.…
కృష్ణ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని జి.కొండూరు మండలం వెలగలేరులోని ప్రభుత్వ మద్యం దుకాణ వాచ్‌మెన్ సాంబయ్యను గుర్తు తెలియని దుండగలు గత రాత్రి హత్య చేశారు. అంతేకాకుండా హత్య అనంతరం మద్యం బాటిళ్లతో పరారయ్యారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. అంతేకాకుండ నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. మద్యానికి బానిసైన వారే ఈ హత్యకు పాల్పడిఉంటారని పోలీసులు…
బాలీవుడ్ హీరోయిన్ నికితా దత్తా కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె రాత్రి నడుచుకొంటూ వెళ్తున్న సమయంలో ఆమెపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడిచేసి ఆమె ఫోను ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని నికితా స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ లో తెలిపింది. “నవంబర్ 19 న జరిగిన ఈ ఘటనను నేను జీవితంలో మర్చిపోలేను.. ఆరోజు రాత్రి 7.45 నిమిషాలకు నేను నడుచుకుంటు వెళుతున్నాను. నా వెనుక బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి నా తలపై కొట్టి నా…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఖుషీ బార్&రెస్టారెంట్ ముందు మందుబాబులు వీరంగం చేశారు. అది కూడా రాత్రిపూట కాదు. మిట్ట మధ్యాహ్నం ఆ బార్&రెస్టారెంట్ లో మద్యం సేవించి నానా బీభత్సం చేశారు. బాగా తాగిన మత్తులో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.మద్యం సేవించి అనంతరం మాట మాట పెరగడంతో ఇరు వర్గాలు ఘర్షణ పడి బార్ ముందు గొడవ సృష్టించారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బీర్ సీసాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో…
హైదరాబాద్ అత్తాపూర్ ఎమ్ఎమ్ పహాడీలో రెచ్చిపోయాడో రౌడీ షీటర్. మహ్మద్ రియాజ్ అనే యువకుడి పై కత్తి తో దాడికి పాల్పడ్డాడు రౌడీ షీటర్ చోర్ అబ్బాస్. కత్తి పోట్లతో తీవ్రంగా గాయపడ్డ రియాజ్ ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఓ ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఎమ్ ఎమ్ పహాడీ వద్ద ఓ వ్యక్తి తో గొడవ పడుతున్నాడు చోర్ అబ్బాస్. వారిని విడిపించే ప్రయత్నం చేశాడు రియాజ్. ఒక్కసారిగా తన వద్ద వున్న…