మంత్రి మల్లారెడ్డిపై దాడి, వ్యక్తిగత దాడి కాదని.. ప్రభుత్వంపై రైతులకు ఉన్న వ్యతిరేఖత అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ నేతలు సెటిలర్ల ఓట్ల కోసం ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ను పిలవకున్నా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని విమర్శించారు. ప్రధానికి కనీస గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. కేసీఆర్ గెలవలేకనే పీకేను అరువు తెచ్చుకున్నాడని అన్నారు. సీఎం కేసీఆర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ…